News February 20, 2025

మల్కాజిగిరి: 63 కిలోల ఎండు గంజాయి పట్టివేత

image

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి, ఆలేరు, మహబూబాబాద్, కాజీపేట ప్రాంతంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 63 కిలోల గంజాయి పట్టుబడినట్లు రైల్వే బృందం తెలిపింది. దీని విలువ దాదాపుగా రూ.20.25లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. గత 3రోజులుగా రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న అధికారులు, గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నారు.  

Similar News

News November 14, 2025

ఐపీఎల్-2026 మినీ వేలం డేట్ ఫిక్స్!

image

ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరగనున్నట్లు ESPN తెలిపింది. వరుసగా మూడో ఏడాది విదేశాల్లోనే ఆక్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎప్పటిలాగే రోజు మొత్తం వేలం సాగే అవకాశముంది. ఈసారి అన్ని జట్లు పెద్ద మొత్తంలో ప్లేయర్లను వదులుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేలం ఆసక్తిగా మారనుంది. మరోవైపు పలు జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటున్నాయి.

News November 14, 2025

కామారెడ్డిలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ‘కిడ్స్ విత్ ఖాకీ’

image

కామారెడ్డి జిల్లా పోలీస్‌ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9:30 గంటలకు నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ స్కిట్‌, అనంతరం 10:30 గంటలకు ట్రాఫిక్‌ ప్లెడ్జ్‌, అలాగే విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్లలో జరిగే విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

News November 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.