News February 20, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు.!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం అమ్రాబాద్‌లో 33.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లావ్యాప్తంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాహనదారులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Similar News

News November 8, 2025

ఘోర ప్రమాదం.. కారు ఎలా ధ్వంసమైందో చూడండి!

image

UPలోని షమ్లీలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును స్విఫ్ట్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు కజిన్ బ్రదర్స్ చనిపోగా, ఒకరికి రేపు పెళ్లి కావాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు కారులోని భాగాలు 100M దూరంలో పడ్డాయి. వాహనం నామ రూపాల్లేకుండా మారడంపై SMలో చర్చ జరుగుతోంది. కొన్నికార్లలో సేఫ్టీ అధ్వానంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News November 8, 2025

మిర్యాలగూడ: మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈదులగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పాస్మో ప్రోగ్సి వొన్ ప్లస్ మాత్రలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

News November 8, 2025

న్యూస్ రౌండప్

image

▶ బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని కలిసిన PM మోదీ. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విషెస్
▶ USలో అనారోగ్యంతో APలోని కారంచేడుకు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి(23) మృతి
▶ UPA హయాంలో 88వేల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపామన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
▶ బిహార్ ఎన్నికల వేళ అన్నదమ్ములు తేజస్వీ యాదవ్‌, తేజ్ ప్రతాప్ మధ్య ముదిరిన వైరం.. సోదరుడితో ఇక ఎన్నటికీ బంధం ఉండదన్న తేజ్ ప్రతాప్