News February 20, 2025

హిజ్రాలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

image

తెలంగాణ ట్రాన్స్‌జెండర్, హిజ్రా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బాగ్‌లింగంపల్లి‌లో శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. టీపీఏస్‌కే రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అత్యంత వివక్షకు గురైన ట్రాన్స్‌జెండర్స్‌కు బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపించాయని వెంటనే మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి వీడదీసి ప్రత్యేకంగా ట్రాన్సె‌జెండర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News November 4, 2025

ఎల్లారెడ్డి: జాతీయ రహదారి పనులకు సహకరించాలి: RDO

image

ఎల్లారెడ్డి పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులకు సహకరించాలని ఆర్డీఓ పార్థ సింహారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఆయన వ్యాపార సముదాయము, దుకాణాలు, ఇళ్ల యజమానులతో సమావేశమై మాట్లాడారు. జాతీయ రహదారి పనులకు ఆటంకం కలిగించొద్దన్నారు. దుకాణ యజమానులు అక్రమ కట్టడాలను తొలగించుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు ప్రజా హితం కోసమే జరుగుతున్నాయన్నారు.

News November 4, 2025

అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.

News November 4, 2025

హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం: SP

image

హోంగార్డు సి‌హెచ్. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఎస్పీ కె.నారాయణ రెడ్డి తెలిపారు. నేడు వికారాబాద్ పోలీస్ కార్యలయంలోని MT సెక్షన్లో విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన హోం గార్డ్ సి‌హెచ్.శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. శ్రీనివాస్ హఠాన్మరణం తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు.