News March 21, 2024
5,348 ఉద్యోగాలకు జూన్‌లో నోటిఫికేషన్?

TG: వైద్యారోగ్యశాఖలో 5,348 <<12890379>>పోస్టుల<<>> భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూన్‌లో నోటిఫికేషన్ రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. DME పరిధిలో 3,234, వైద్య విధాన పరిషత్‌లో 1,255, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 575, MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 212, IPMలో 34, ఆయుష్ విభాగంలో 26, ఔషధ నియంత్రణ మండలిలో 11 పోస్టులున్నాయి. మొత్తంగా 1,989 నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Similar News
News April 3, 2025
BREAKING: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జడ్జిల ఆస్తుల వివరాలు ప్రజలకు తెలిసేలా కోర్టు వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో మొత్తం 33 మంది జడ్జిల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణ సుప్రీంకోర్టుకు భవిష్యత్‌లో వచ్చే జడ్జిలకూ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవల జడ్జి యశ్వంత్ వర్మ(ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి) ఇంట్లో భారీగా నోట్లకట్టలు లభ్యమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
News April 3, 2025
ఆ నోళ్లను 10 నెలల్లోనే మూయించాం: లోకేశ్

AP: రాష్ట్రంలో JCB పాలన పోయి, పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి లోకేశ్ అన్నారు. తాను గెలిస్తే మంగళగిరిలోని ఇళ్లు పీకేస్తారంటూ ప్రచారం చేసిన నోళ్లను 10నెలల్లోనే మూయించామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి పట్టాలిచ్చే హామీని తన నియోజకవర్గం నుంచే నెరవేరుస్తున్నట్లు చెప్పారు. తొలి విడత 3వేల ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. స్వచ్ఛతలో మంగళగిరిని దేశంలోనే నంబర్-1 చేస్తామని చెప్పారు.
News April 3, 2025
ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల ముగిశాయి. హిమాచల్ ఎమ్మెల్యే రాణా అనర్హత కేసు విషయాన్ని SC ప్రస్తావించగా అది పూర్తిగా విభిన్నమని ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయవాదుల తీరు మారిపోతోందని జస్టిస్ బీఆర్ వ్యాఖ్యానించారు.