News February 20, 2025
NZB: NEXT ఎలక్షన్‌లో 100 MLA సీట్లు మావే: TPCC చీఫ్

బీసీలపై ప్రేమతోనే కులగణన చేపట్టామని TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. BRS, BJP ఒక్కటే అని, అవి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP ఎంపీలు ఉంటే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News July 6, 2025
రేపు భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News July 6, 2025
సూళ్లూరుపేట: ఐటీయూ డైరెక్టర్ పదవికి నామినేషన్

ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డు డైరెక్టర్‌గా భారత అభ్యర్థిగా సూళ్లూరుపేటకు చెందిన రేవతి మన్నెపల్లిని కేంద్రం నామినేట్ చేసింది. ఇస్రో, బార్క్ వంటి సంస్థల్లో సేవలందించిన ఆమె ప్రస్తుతం జెనీవాలో సభ్యురాలిగా ఉన్నారు. రేవతి JNTUHలో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోకు చెందిన షార్ కేంద్రంలో ఇంజినీర్‌గా పనిచేశారు. ASLV, PSLV రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు.