News February 20, 2025
వరంగల్: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,400 పలకగా.. నేడు రూ.13,600కి పెరిగింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.16,100 ధర రాగా.. ఈరోజు రూ. 16,300 కి పెరిగింది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.13,300 ధర వచ్చింది.
Similar News
News November 12, 2025
సిరిసిల్ల: లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి: ఇన్‌చార్జి కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలోని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.
News November 12, 2025
గురుకులాల బకాయిలు విడుదల చేయాలి: డిప్యూటీ సీఎం

ప్రజా భవన్‌లో గురుకులాల సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ, మైనారిటీ గురుకులాల ₹163 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు మెనూను తప్పక పాటించాలని సూచించారు. ఆహార నాణ్యత, తనిఖీల విషయంలో రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
News November 12, 2025
ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.


