News February 20, 2025
NLG: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల (అంధ, బధిర, మానసిక, శారీరక దివ్యాంగులు)కు ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి కేవీ.కృష్ణవేణి తెలిపారు. దరఖాస్తులను మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News July 4, 2025
నల్గొండ: ‘బీఏఎస్ విద్యార్థులపై వివక్ష తగదు’

బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులపై ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతోందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఆరోపించారు. శుక్రవారం పేరెంట్స్‌తో కలిసి నల్గొండ ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్‌లో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని, బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెడుతున్నారన్నారు.
News July 4, 2025
NLG: ‘కొమురయ్య పోరాట పటిమ ఆదర్శప్రాయం’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని సీపీఎం నేతలు నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆయన పోరాట పటిమ అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
News May 7, 2025
మ్యుటేషన్‌తో వివాదాలకు చెక్: నల్గొండ కలెక్టర్

భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భూములు సర్వే చేసిన తర్వాత మ్యుటేషన్ చేసినట్లయితే ఎలాంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు.