News February 20, 2025
ఎల్ఆర్ఎస్ అమలు వేగవంతం: శ్రీధర్ బాబు

ఎల్ఆర్ఎస్ ప్రగతిపై సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సహచర మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని వేగంగా అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం 25 శాతం రాయితీ అందించాలని నిర్ణయించామని తెలిపారు. గడిచిన 4 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్లాట్లు కొనుగోలు చేసిన పేదలకు ఈ నెల 31 వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు.
Similar News
News July 7, 2025
ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై ఉమ్మడి గుంటూరులో ఆసక్తి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌కు 33,063 మంది హాజరైన వారిలో 23,536 మంది అర్హత సాధించారు. జిల్లాలోని రెండు ప్రభుత్వ యూనివర్సిటీలు (ANUతోపాటు JNTU నరసరావుపేట) సహా 34 ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 32,240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు, 22న సీట్లు కేటాయించనున్నారు. అయితే అభ్యర్థుల కంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి.
News July 7, 2025
యాదాద్రి: మహిళలకు అబార్షన్.. పోలీసుల అదుపులో వైద్యుడు

భువనగిరి గాయత్రి ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన ఓ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు SI కుమారస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి హాస్పిటల్‌కు వెళ్లి తనిఖీ చేయగా మహిళలకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచగా, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్కానింగ్ చేసిన మరో డాక్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మహిళలు ఇద్దరు యాదాద్రి జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.
News July 7, 2025
KU పరిధిలో 2,356 సీట్లు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.