News February 20, 2025

పల్నాడు: ఎమ్మెల్సీ ఓటును చెక్ చేసుకోండి ఇలా..

image

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదైన వ్యక్తులు తమ ఓటు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా <>https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html<<>> లింక్‌ను ఓపెన్ చేయాలి. రైట్ సైడ్‌లో MLC Registration 2024ను క్లిక్ చేస్తే 4 ఆప్షన్లు వస్తాయి. అందులో Search Your Name క్లిక్ చేసిన తర్వాత గ్రాడ్యుయేట్ కృష్ణా/గుంటూరు క్లిక్ చేసి Application ID/Name/ ఇంటి నంబర్ మూడింటిలో ఒకటి ఎంచుకుంటే పూర్తి వివరాలు వస్తాయి.

Similar News

News November 11, 2025

అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, సీనియర్ అధికారులు హాజరయ్యారు. J&K డీజీపీ వర్చువల్‌గా పాల్గొంటున్నారు.

News November 11, 2025

NZB: DDలో పట్టుబడితే రూ.10వేల జరిమానా: ట్రాఫిక్ CI

image

నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ (DD)లో పట్టుబడితే రూ.10 వేల జరిమానాతోపాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని ఆయన హెచ్చరించారు.

News November 11, 2025

NLG: 50% సిలబస్ ఇంకా అలానే..!

image

ఇంటర్ సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 140 ఉన్నాయి. వాటిలో 12,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొన్ని కాలేజీల్లో 50% సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఐదు నెలల్లో కేవలం 50 శాతం మాత్రమే సిలబస్ పూర్తి అయింది.