News February 20, 2025
MNCL: వ్యాపారం ముసుగులో గంజాయి అమ్మకం

మంచిర్యాలలో CC కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి వ్యాపార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. IBx రోడ్, SBIకాంప్లెక్స్ కింద సెల్లార్‌లో ప్రవీణ్ కుమార్‌కి చెందిన Yఇన్ఫో సొల్యూషన్స్‌లో పోలీసులు సోదాలు చేశారు. కాగా అక్కడ తరలించేందుకు సిద్ధంగా ఉన్న CC కెమెరాల కాటన్ బాక్సుల్లో సుమారుగా రూ.11,75,000 విలువగల 23.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 22మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News November 13, 2025
HYD: బిజీ లైఫ్ వల్ల బ్రెయిన్‌పై ఎఫెక్ట్!

HYDలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, నిద్రలేమి, పొగతాగడం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా మెదడుపై తీవ్రంగా ప్రభావం పడుతున్నట్లుగా సీనియర్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ తెలిపారు. HYDలో NIMS ఆసుపత్రికి నెలకు 250 నుంచి 300 కేసులు వస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత, యోగా, ధ్యానం, ప్రకృతితో గడపడం లాంటివి చేయాలని సూచించారు.
SHARE IT
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడప కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన చిన్న సుంకిరెడ్డికి ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైలు అధికారులు వెల్లడించారు.
News November 13, 2025
పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో CM చంద్రబాబు

విశాఖలో CII సుమ్మిట్‌లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నట్లు CM పేర్కొన్నారు.


