News February 20, 2025
హైకోర్టు జడ్జీలపై లోక్‌పాల్ విచారణ ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు

లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల కింద హైకోర్టు జడ్జీలపై విచారణకు ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆ ఆదేశాలు తమను తీవ్రంగా కలచివేశాయని పేర్కొంది. ఇద్దరు హైకోర్టు జడ్జీలపై Jan 27న లోక్‌పాల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సుమోటోగా తీసుకొని విచారించింది. హైకోర్టు జడ్జీలు లోక్‌పాల్ పరిధిలోకి రారని, చట్టంలో తప్పుగా నిర్వచించారని కేంద్రం తరఫున వాదించిన SG తుషార్ మెహతా సైతం పేర్కొనడం గమనార్హం.
Similar News
News January 1, 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది 1.2 కోట్ల కొలువులు!

2026లో ఉద్యోగ నియామకాల జోరు మరింత పెరగనున్నట్లు టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టాటా మోటార్స్, EY, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు టెక్నాలజీ, AI రంగాల్లో భారీగా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఇస్తూ వైవిధ్యతను పెంచడంపై కంపెనీలు ఫోకస్ పెట్టడం విశేషం.
News January 1, 2026
ప్రసాదంపై తప్పుడు వీడియో… భక్తులపై కేసు

AP: ప్రసాదంలో నత్తగుల్ల వచ్చిందని వీడియో పెట్టిన ఇద్దరు భక్తులపై సింహాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. DEC 29న ఆ భక్తులు ప్రసాదాన్ని బయటకు తీసుకెళ్లి తిరిగి తెచ్చారని, ఆ సమయంలో వారు కల్తీ చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘ఆరోజు 15వేల పులిహోర పొట్లాలు అమ్మాం. ఇలాంటి ఫిర్యాదు గతంలోనూ ఎవరినుంచీ రాలేదు. ప్రసాదం తయారీలో నిపుణులైన వంటవారు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 1, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు ఎక్కువగా ఉంటే?

నెలలు నిండే కొద్దీ గర్భిణులకు కాళ్ల వాపులు వస్తాయి. ఇవి తగ్గాలంటే ఎక్కువసేపు కూర్చోకుండా అటూఇటూ తిరగాలి. పాదాల కింద దిండు పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొంటే కాళ్లను పైకి పెట్టుకోవాలి. వేడిగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బరువు పెరగకుండా ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, తీపి తగ్గించాలి. సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


