News February 20, 2025
SHOCK: 119 యాప్‌లపై నిషేధం!

కేంద్రం 119 యాప్‌లను నిషేధిస్తూ గూగుల్ ప్లేస్టోర్‌కు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. వీటిలో ఎక్కువగా చైనా, హాంకాంగ్ డెవలపర్లతో సంబంధం ఉన్న వీడియో, వాయిస్ ఛాట్ యాప్‌లే ఉన్నాయని సమాచారం. IT చట్టం 69A ప్రకారం FEB 18న నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వీటి డేటాబేస్లు విదేశీ సర్వర్లలో నిక్షిప్తం చేయడం, ప్రైవసీ, జాతీయ భద్రత, రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Similar News
News November 12, 2025
షాహీన్.. పనులతో పరేషాన్!

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్‌ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.
News November 12, 2025
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెంచుతాం: మంత్రి తుమ్మల

TG: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా.. మరో 12 లక్షల ఎకరాలు ఈ పంట సాగుకు అనువుగా ఉందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది కొత్తగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ.. వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచుతామన్నారు.
News November 12, 2025
వంటింటి చిట్కాలు

* బెండ, దొండ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.
* కుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేసి వంటకాల్లో వేస్తే చక్కటి రంగు, రుచి వస్తాయి.
* గ్రేవీలో వేయడానికి క్రీమ్ అందుబాటులో లేకపోతే చెంచా చొప్పున మజ్జిగ, పాలు తీసుకొని కలిపితే సరిపోతుంది.
* బెల్లం, చింతపండు వంటివి త్వరగా నలుపెక్కకూడదంటే ఫ్రిజ్‌లో ఉంచండి.
<<-se>>#VantintiChitkalu<<>>


