News February 20, 2025
కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమే: ఉత్తమ్

TG: నీటి పారుదల రంగాన్ని నాశనం చేసిన ఘనత BRSదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ దుయ్యబట్టారు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని, జేబులు నింపుకొనేందుకే నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమేనన్నారు. మరోవైపు రాష్ట్రంలోని జల అవసరాలపై కేంద్రంతో చర్చించామని ఉత్తమ్ వెల్లడించారు. కృష్ణ జలాల్లో AP దోపిడీని కేంద్రానికి వివరించామని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరామని చెప్పారు.
Similar News
News February 22, 2025
iPhone ప్రైవసీపై ద్వంద్వ ప్రమాణాలు.. మీ కామెంట్

యూజర్ల ప్రైవసీపై పాఠాలు చెప్పే APPLE ఇప్పుడు బ్రిటన్లో క్లౌడ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ తొలగించడం సంచలనంగా మారింది. దాని ద్వంద్వ ప్రమాణాలపై చర్చ జరుగుతోంది. గతంలో కొన్ని కేసుల్లో నిందితుల iPhones అన్‌లాక్ చేయాలని ED, CBI దానిని కోరాయి. అప్పుడేమో తమ ప్రైవసీ రూల్స్ ప్రకారం కుదరదని తెగేసి చెప్పింది. ఇప్పుడేమో ఇన్వెస్టిగేషన్లకు ఇబ్బందులు వస్తున్నాయని UK అడగ్గానే ADP ఫీచరే తొలగించింది. దీనిపై మీ కామెంట్.
News February 22, 2025
పాముvsముంగిస.. పోరులో దేని బలమెంత?

పాము, ముంగిసలకు శత్రుత్వం ఉందని మనం వింటూ ఉంటాం. దీనికి కారణం ముంగిస పిల్లలను పాములు తినడమేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే అవి కనిపించగానే ఆడ ముంగిసలు దాడి చేస్తాయంటున్నారు. ‘చురుకుదనమే ముంగిసల బలం. అనుభవం లేనివి కూడా పాములు, కోబ్రాలను ఓడించగలవు. ఒక్కదెబ్బతో చంపగలవు. ఓ మోతాదు విషాన్ని అవి తట్టుకోగలవు. అత్యంత విషపూరితమైన పాము కాటు మాత్రమే ముంగిసను చంపగలదు’ అని చెబుతున్నారు.
News February 22, 2025
SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.