News February 20, 2025
యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: APPSC

గ్రూప్-2 మెయిన్ పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని APPSC ఛైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. ఈనెల 23న 10am-12.30pm పేపర్-1, 3pm-5.30pm పేపర్-2 నిర్వహిస్తామని తెలిపారు. 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు 100m పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సోషల్ మీడియాలో వదంతులు సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 22, 2025
SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.
News February 22, 2025
పిల్లలకు ఇవి నేర్పించండి

భారతదేశం ఉన్నత విలువలు, సంప్రదాయాలకు ప్రసిద్ధి. పిల్లలకు వీటిని నేర్పించడం ద్వారా చిన్న వయసు నుంచే దేశ వారసత్వానికి వారు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇతరులను పలకరించే సమయంలో నమస్కరించడం, చేతులతో ఆహారం తినడం, తినే ముందు ప్రార్థించడం, ప్రకృతిని, పెద్దలను గౌరవించడం, పండుగలు చేసుకోవడం, అతిథులకు మర్యాద చేయడం వంటివి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిస్తే ఉన్నత స్థానానికి తీసుకెళతాయి.
News February 22, 2025
యూజర్లకు iPhone షాక్.. నో ప్రైవసీ!

iPhone అంటే ప్రైవసీ. ప్రైవసీ అంటే iPhone. ఇప్పుడా పరిస్థితి మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్లౌడ్ డేటా స్టోరేజ్‌కు వాడే ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ (ADP)ను బ్రిటన్లో అందించడం లేదు. అంటే ఇకపై క్లౌడ్‌లో యూజర్ దాచుకున్న ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలను ఇతరులు యాక్సెస్ చేసేందుకు వీలవుతుంది. గతంలో యాపిల్‌కూ యాక్సెస్ వీలయ్యేది కాదు. ADPని తొలగించడం నిరాశ కలిగించిందని కంపెనీ అంటోంది.