News February 20, 2025

HDFC ఖాతాదారులకు అలర్ట్

image

HDFC ఖాతాదారుల UPI పేమెంట్స్ 22వ తేదీ సేవలు నిలిచిపోనున్నట్లు ఆ బ్యాంక్ తెలిపింది. ఆ రోజు తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు HDFC ఖాతా లింక్ అయిన UPI సేవలు పని చేయవని వెల్లడించింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి సిస్టం మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు HDFC పేర్కొంది. అయితే, ఆ సమయంలో లావాదేవీల కోసం PayZapp ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

Similar News

News September 16, 2025

కడియం శ్రీహరి దారెటు? రాజీనామా చేస్తారా?

image

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కు MLA కడియం శ్రీహరి ఇంకా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇతర ఎమ్మెల్యేల తరహాలో BRSలోనే ఉన్నానని సమాధానం ఇస్తారా? రాజీనామా చేసి ఉపఎన్నికలో మళ్లీ గెలిచి విమర్శకుల నోరు మూయించాలనే యోచనలో ఉన్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే తనకు చివరి ఎన్నికలని గతంలో ప్రకటించిన ఆయన ఇప్పుడు రిస్క్ ఎందుకు అనుకుంటారా అనేది చూడాలి.

News September 16, 2025

OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్‌లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.

News September 16, 2025

ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం ఆగ్రహం

image

TG: ఈ రోజు రాత్రి నుంచి <<17723721>>ఆరోగ్యశ్రీ సేవలను బంద్<<>> చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలకు రూ.75 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ప్రతినెలా బెదిరింపులు తంతుగా మారాయని, ఇక నుంచి అలా చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.