News February 20, 2025
KNR: బెంగళూరు వెళ్లేవారికి 10% రాయితీ: RM

కరీంనగర్, గోదావరిఖని డిపో నుంచి బెంగళూరుకు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులలో ప్రయాణించే ప్రయాణీకులకు వారి బస్ ఛార్జీలో 10% రాయితీ కల్పించినట్లు కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణీకులు 10% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 27, 2026
BREAKING: కరీంనగర్‌లో కొలువుదీరిన కొత్త కలెక్టర్

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టగా.. నూతన కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిత్రా మిశ్రా పేర్కొన్నారు.
News February 27, 2026
KNR: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్

తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోగా tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. మార్చి13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. వివరాలకు 9704061725 సంప్రదించండి.