News February 20, 2025

కేసీఆర్, జగన్ స్నేహం వల్లే ఏపీ జల దోపిడీ: మంత్రి ఉత్తమ్

image

TG: BRS సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. AP మాజీ CM జగన్‌తో స్నేహంగా ఉంటూ ఆ రాష్ట్ర జల దోపిడీకి BRS సహకరించిందని మండిపడ్డారు. ‘జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా, ముచ్చుమర్రి నిర్మిస్తున్నా KCR నోరెత్తలేదు. కృష్ణా జలాలను బేసిన్ అవకతవకలకు తరలిస్తున్నా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ దీనిని అడ్డుకుని ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండేది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News November 8, 2025

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.

News November 8, 2025

TODAY HEADLINES

image

✦ ₹1,01,899Cr పెట్టుబడులకు CM CBN ఆమోదం
✦ బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP
✦ TG: ఫీజు బకాయిల విడుదలకు ప్రభుత్వం అంగీకారం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్
✦ కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్
✦ వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: PM
✦ టెక్నికల్ సమస్య.. ఢిల్లీ, ముంబైలో విమాన సేవలకు అంతరాయం

News November 8, 2025

వాట్సాప్‌లో క్రాస్ ప్లాట్‌ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

image

వాట్సాప్ క్రాస్ ప్లాట్‌ఫామ్ అనే కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్‌కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.