News February 20, 2025

లక్షెట్టిపేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

లక్షెట్టిపేట మండలం హనుమంతుపల్లికి చెందిన నస్పూరి గౌరయ్య(49) స్లాబ్ రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సతీశ్ తెలిపారు. గౌరయ్య ముంబైలో కూలి పనిచేసి సంవత్సరం క్రితం గ్రామానికి వచ్చి కూతురు పెళ్లి చేసి ఇల్లు కట్టుకున్నాడు. వాటికోసం సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడన్నారు. అప్పులు తీర్చడం భారమై గౌరయ్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News September 14, 2025

పెదాలు అందంగా ఉండాలంటే

image

పెదాలు అందంగా, తాజాగా ఉండాలంటే మీ స్కిన్‌కేర్‌లో లిప్ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇది చూడటానికి లిప్‌గ్లాస్‌లా ఉంటుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలు పగలకుండా చూస్తాయి. వీటిని లిప్‌స్టిక్‌కి జత చేస్తే పెదాలు ఎక్స్‌ట్రా షైనీగా ఉంటాయి. లిప్‌ఆయిల్స్‌లో ఉండే విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్ లిప్‌బామ్‌ కంటే ఎక్కువ హైడ్రేషన్‌ ఇస్తాయి. వీటిలో కూడా SPF ఉండేవి వాడితే యూవీ కిరణాల నుంచి పెదాలని రక్షిస్తాయి.

News September 14, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలోని జానంపేటలో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. బాలానగర్ 50.5, భూత్పూర్ 12.8, మహబూబ్ నగర్ గ్రామీణం 12.3, దేవరకద్ర 11.8, రాజాపూర్ 7.8, నవాబుపేట 6.8, హన్వాడ 6.3, జడ్చర్ల 5.0 మిల్లీ మీటర్లు వర్షం పడింది.

News September 14, 2025

MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.