News February 20, 2025
ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

గోస్పాడులోని ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ జీ.రాజకుమారి గురువారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్‌వో ప్లాంట్‌లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని ల్యాబ్ గదులన్నింటికీ తాళాలు వేయకుండా వాటిని క్రమం తప్పకుండా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.
Similar News
News November 15, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌కు TDP అభిమానుల మద్దతు కలిసొచ్చిందా..?

TDP అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ నేతల మద్దతు కాంగ్రెస్‌కు కలిసొచ్చిందంటూ చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రచారంలోనూ TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు కనిపించాయి. 20 ఏళ్లు TDP ఫ్యాన్స్ మాగంటి గోపీనాథ్ వెంటే ఉన్నారు. కాగా నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తోపాటు CM రేవంత్ రెడ్డి గతంలో TDP నేతలు కావడంతో ఆ పార్టీ అభిమానుల ఓట్లు ఈసారి BRSకు కాకుండా కాంగ్రెస్‌కు వేసినట్లు టాక్.

ఖమ్మం: ఆర్ఎంపీ వేధింపులు.. యువతి ఆత్మహత్య

కారేపల్లి (M) రేలకాయలపల్లిలో దారుణం జరిగింది. ఆర్ఎంపీ వైద్యుడు నామ నరేష్ వేధింపులు భరించలేక జర్పుల సందీప్తి (22) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. స్నేహం ముసుగులో సెల్ఫీ ఫొటోలు తీసుకుని, పెళ్లి చేసుకోవాలని నరేష్ వేధించడంతో మనస్తాపం చెంది 13న పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.