News February 20, 2025
కృష్ణా: పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీలో ఎంటెక్ (2024 రెగ్యులేషన్) కోర్సు చదివే విద్యార్థులు రాయవలసిన మొదటి సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలయ్యింది. ఈనెల 24,25, 27, 28 మార్చ్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షల నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్ కోసం https//kru.ac.in// వెబ్ సైట్‌లో చూడాలని సూచించింది.
Similar News
News January 11, 2026
కృష్ణా జిల్లా ‘రెవెన్యూ’లో ఎన్నికల కోలాహలం!

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ కృష్ణా జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవితోపాటు ఇతర కార్యవర్గ ఏర్పాటుకు నేడు ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పదవికి ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు పోటీ చేస్తున్నారు. రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎన్నిక అనివార్యంగా తెలుస్తోంది. మచిలీపట్నంలోని రెవెన్యూ హాలులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరించి 3.30 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు.
News January 10, 2026
కృష్ణా జిల్లాలో ఎస్ఐల బదిలీ

ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ఎస్ఐలను బదిలీ చేశారు. మొత్తం 38 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ బదిలీలు జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.
News January 10, 2026
కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.


