News February 20, 2025

ఎంఎస్ఎంఈ స‌ర్వే త‌నిఖీ చేసిన: కలెక్టర్

image

నందిగామ‌లో ఎంఎస్ఎంఈ స‌ర్వే ప‌రిశీల‌న కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం త‌నిఖీ చేశారు. అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ స‌ర్వేను విస్తృత స్థాయిలో చేప‌ట్ట‌డం జ‌రుగుతోంద‌ని, ఆరోగ్య‌క‌ర పారిశ్రామిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పెంపొందించే ల‌క్ష్యంతో ఈ స‌ర్వేను చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే త‌మ ప‌రిధిలోని గ్రామ, వార్డు స‌చివాల‌యాన్ని సంప్ర‌దించాలని అయన కోరారు. 

Similar News

News January 2, 2026

NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.

News January 2, 2026

రూ.7వేల కోట్లతో హైదరాబాద్‌కు గోదావరి జలాలు: సీఎం రేవంత్

image

TG: ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ జలాలను (15 టీఎంసీలు) హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధిని ఎన్నికల అజెండాగా పెట్టుకున్న బీజేపీ.. ఇక్కడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.

News January 2, 2026

ఆదిలాబాద్: వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం: ఎస్పీ

image

వీడీసీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీలపై కేసులు తప్పవన్నారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.