News February 20, 2025
పోలవరంపై కేంద్రమంత్రికి ఎంపీ సానా సతీష్ విజ్ఞప్తి

పోలవరం ప్రాజెక్టు పనులు పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లతో కలిసి సతీష్ బాబు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్‌ను గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని కాకినాడలోని ఎంపి కార్యాలయ ప్రతినిధులు మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
Similar News
News January 25, 2026
మూడో టీ20.. భారత్ టార్గెట్ ఎంతంటే?

టీమ్ ఇండియాతో మూడో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. NZ బ్యాటర్లు ఫిలిప్స్(48), చాప్మన్(32) ఫర్వాలేదనిపించడంతో మోస్తరు స్కోరు చేసింది. ఓపెనర్ కాన్వే(1), రవీంద్ర(4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 3, బిష్ణోయ్, హార్దిక్ తలో రెండు, హర్షిత్ రానా ఒక వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 154.
News January 25, 2026
కడపలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడప సిద్ధమైంది. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో రేపు ఉదయం 8:30 గంటలకు జాతీయ జండాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News January 25, 2026
ఇంట్లో అద్దం ఏ వైపున ఉండాలంటే..?

అద్దాలు సరైన దిశలో ఉంటేనే ఇల్లు దోషరహితం అవుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అద్దాలు తూర్పు, తూర్పు-ఈశాన్యం, ఉత్తర-ఈశాన్యం గోడలకు అమర్చాలని సూచిస్తున్నారు. అలా ఉండటమే శ్రేయస్కరం అంటున్నారు. ‘వీటి వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దీర్ఘచతురస్ర, వృత్తాకార అద్దాలు ఉత్తమం. పగిలిన అద్దాలు ఉంచకూడదు. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అప్పుడే వాస్తు బలం చేకూరుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


