News February 20, 2025

వనపర్తి: పన్ను ఎగవేత దారులను గుర్తించండి: అదనపు కలెక్టర్

image

ఆదాయపు పన్ను ఎగవేత దారులను కట్టడి చేయడం కోసం అధిక మొత్తంలో చేసే లావాదేవీలను గుర్తిండం కీలకమని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించి రిపోర్ట్ చేసేందుకు తహశీల్దారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పన్ను ఎగవేత దారులను గుర్తించడం కీలకమన్నారు.

Similar News

News September 19, 2025

వరంగల్: మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాదం!

image

మద్యం తాగి డ్రైవ్ చేయవద్దని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన అవగాహన పోస్టర్‌లో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, అమాయకుల ప్రాణాలకు ప్రమాదం వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది మద్యం తాగి వాహనం నడపడం వల్ల అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.

News September 19, 2025

HYD: మన బతుకమ్మ ఇంటర్నేషనల్ రేంజ్‌కు లోడింగ్

image

ఈ ఏడాది బతుకమ్మ వేడుక చరిత్రలోనే కీలక ఘట్టంగా SEP 28న ఎల్బీస్టేడియంలో ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపై 20,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు పర్యాటకశాఖ నడుం బిగించింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచపటం మీద నిలిపేందుకు, విదేశీ ఎయిర్‌లైన్ల నుంచి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణ. ఇదే జరిగితే బతుకమ్మ ప్రపంచస్థాయి పండుగగా గుర్తింపు పొందడం ఖాయం.