News February 20, 2025
వరంగల్ మార్కెట్‌కి 5 రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 5 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 26 మహాశివరాత్రి, 27న జాగరణ, 28న అమావాస్య, మార్చ్ 1, 2న శనివారం, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 5 రోజులు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు. తిరిగి మార్చి 3న సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News March 1, 2026
నరసాపురం: పెద్ద మనిషిలా వచ్చి.. బాలికపై లైంగిక వేధింపులు

నరసాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలిక కుటుంబ వివాదాలను చక్కదిద్దుతామని పెద్ద మనిషిలా వచ్చి, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి రావాల్సిన నగదు విషయంలో నిందితుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆమెను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ముత్యాలరావు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 1, 2026
GNT: ఏకాంత వీడియోలతో బ్లాక్ మెయిల్

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త, తండ్రికి పంపించి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం(D)యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. అయితే ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపిస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 1, 2026
నంద్యాల జిల్లాలో మటన్ రూ. 1000

నంద్యాల జిల్లాలోని మాంసం దుకాణాల వద్ద ఆదివారం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. జిల్లాలోని నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ వంటి పలు ప్రాంతాల్లో వినియోగదారులు మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు కేజీ మటన్ రూ.1000 విక్రయిస్తున్నారు. చికెన్ స్కిన్‌లెస్ రూ.250, విత్ స్కిన్ రూ.230, చికెన్ లైవ్ రూ. 195, చేపలు కేజీ రూ.180, గుడ్లు డజను రూ.70గా ఉన్నాయి.


