News February 20, 2025
కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై న్యాయవిచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున APR 30 వరకు పొడిగించారు. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 23న HYD వచ్చి మిగిలిన విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా గత ప్రభుత్వ పెద్దలను పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News September 18, 2025
iOS 26పై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు

ఐఫోన్ 11, ఆ తర్వాతి మోడల్స్‌కి iOS 26 స్టాండర్డ్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొందరు లిక్విడ్ గ్లాస్ న్యూ డిజైన్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, లాక్ స్క్రీన్, హోం స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ బాగున్నాయంటున్నారు. మరికొందరు ‘బ్యాటరీ వెంటనే డ్రెయిన్ అవుతోంది, ఫోన్ వేడెక్కుతోంది’ అని ఫిర్యాదు చేస్తున్నారు. మేజర్ అప్‌డేట్ ఇలాంటివి సహజమేనని త్వరలోనే అంతా సర్దుకుంటుందని యాపిల్ కంపెనీ చెబుతోంది.
News September 18, 2025
పాక్-సౌదీ మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం

పాకిస్థాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు వ్యూహాత్మక ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయం చెప్పినట్లు డాన్ న్యూస్ పేపర్ పేర్కొంది. డిఫెన్స్ సపోర్ట్‌ను మెరుగు పరచుకోవడానికి ఈ ఒప్పందం దోహద పడుతుందని ఆ దేశాలు ఆకాంక్షించాయి.
News September 18, 2025
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.