News February 20, 2025
ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థల పరిశీలన

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించడానికి వివిధ మండలాలలో పరిశీలించిన భూ స్థలాల వివరాలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం స్టేట్ ఫ్లాగ్ షిప్ స్కీమ్స్ కమిషనర్ శశాంకకు వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి గానూ జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి మ్యాప్‌ల ద్వారా వివరాలను తెలియజేశారు.
Similar News
News January 17, 2026
తుని: వైసీపీ దాడిపై టీడీపీ నేతల ఆగ్రహం

అల్లిపూడి ఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో వైసీపీ నేత దాడిలో <<18877211>>లాలం బంగారయ్య<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, యనమల దివ్య ఆదేశాల మేరకు టీడీపీ నేతలు హుటాహుటినా ఆసుపత్రికి చేరుకున్నారు. మృతి చెందిన లాలం బంగారయ్య కుటుంబ సభ్యులను యనమల రాజేష్ పరామర్శించారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
News January 17, 2026
పాలమూరు:ఉచిత శిక్షణ.. రేపే లాస్ట్!

ఉమ్మడి MBNR జిల్లాలోని గ్రామీణ యువకులకు SBI,RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్ & సర్వీసింగ్ కోర్సులలో ఈనెల 19 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందని, 19-45లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 18లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 99633 69361 సంప్రదించాలన్నారు.
News January 17, 2026
ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!

TG: మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి SEC అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ బల్దియా, వార్డులు ఏయే వర్గాలకు రిజర్వ్ అయ్యాయో తుది ప్రకటన వెలువడనుంది. అటు ఎన్నికల్లో పాల్గొననున్న ఇండిపెండెంట్ల కోసం నిన్న 75 గుర్తులను ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. కాగా ఇటీవల సర్పంచ్ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.


