News March 21, 2024

పతంజలి ఎండీ క్షమాపణలు

image

పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ బేషరతు క్షమాపణలు చెప్పారు. సంస్థ ఉత్పత్తుల యాడ్స్ తప్పుదోవపట్టించేలా ఉండటంపై ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదని భవిష్యత్తులో ఈ తప్పులు జరగవని వివరించారు. కాగా వ్యాధుల చికిత్సకు సంబంధించి పతంజలి ఆయుర్వేద్ ఉత్పత్తుల యాడ్స్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే నిషేధం విధించింది.

Similar News

News October 1, 2024

ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయండి: మంత్రి అనగాని

image

AP: ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. CCLA ఆఫీసులో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘గ్రీవెన్స్ ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలి. ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం 10 సార్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నెలాఖరులోగా పూర్తి చేయాలి’ అని ఆదేశించారు.

News October 1, 2024

మారుతీ సుజుకీ అమ్మకాల్లో పెరుగుదల

image

సెప్టెంబరులో తమ కార్ల అమ్మకాలు పెరిగాయని మారుతీ సుజుకీ ప్రకటించింది. మొత్తం 1,84,727 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువని పేర్కొంది. తాము అమ్ముతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి సీఎన్‌జీ వేరియంట్ అని వివరించింది. తొలిసారిగా సీఎన్‌జీ అమ్మకాలు 50వేల మార్కు దాటినట్లు స్పష్టం చేసింది. మరోవైపు హ్యుందాయ్ 64,201 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది.

News October 1, 2024

ALERT.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, జనగామ, గద్వాల్, కరీంనగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తోంది.