News March 21, 2024

AP పాలిసెట్ తేదీలో మార్పు లేదు: కమిషనర్

image

ఏపీ పాలిసెట్ నిర్వహణ తేదీలో మార్పు ఉండదని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27న పరీక్ష జరుగుతుందన్నారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిసెట్‌ను మే 17 నుంచి 24వ తేదీకి మార్చారు.

Similar News

News November 9, 2025

PGIMERలో ఉద్యోగాలు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<>PGIMER<<>>) 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 19న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MDS, డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News November 9, 2025

జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

image

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్‌ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్‌లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?

News November 9, 2025

15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్‌సిగ్నల్?

image

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్‌(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.