News February 21, 2025

కాకినాడ జిల్లాలో TODAY TOP NEWS

image

☞జగన్‌ను కలిసిన కన్నబాబు, ☞సామర్లకోట, పిఠాపురం ఆలయాలను సందర్శించిన ఎస్పీ,☞ 48 గంటల్లోనే నిందితులు అరెస్టు,☞పెద్దాపురం: ఎనిమిది మంది వీర్వోలుకు మెమోలు☞ పిఠాపురం: శానిటైజేషన్ సూపర్వైజర్‌పై వ్యక్తి దాడి, ☞తూ.గో జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు,☞పిఠాపురం: 30 ఎకరాల విస్తీర్ణంలో జనసేన ప్లీనరీ సమావేశం, ☞మీడియాకు చురకలు అంటించిన కాకినాడ ఎంపీ, ☞కాకినాడ: ఓటర్లకు ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాఘ‌వులు అభ్యర్థన

Similar News

News July 9, 2025

కాన్వాయ్ ఆపితే SPని తొక్కిస్తారా: MLA మురళీ

image

YS జగన్ కాన్వాయ్ ఆపితే SPని తొక్కిస్తారా అంటూ పూతలపట్టు MLA మురళీ మోహన్ మండిపడ్డారు. జగన్ పర్యటనలో ఓ విలేకరి గాయపడ్డట్లు పేర్కొన్నారు. ‘మీ పర్యటన సందర్భంగా మీడియాపై ఆంక్షలు విధించారా? కాన్వాయ్ ఆపితే SPని తొక్కించమని చెబుతారు. పెద్దిరెడ్డి DSP చేయి నరకమని పురమాయిస్తారు. ఒక్క రైతు, ఫ్యాక్టరీ యాజమాని లేకుండా ఆయన పర్యటన జరిగింది. జనం తొక్కడంతో టన్నుల పంట నాశనం అయింది’ అంటూ ఆయన ఓ మీడియాతో మాట్లాడారు.

News July 9, 2025

పెంపుడు కుక్క మీ జీవితకాలాన్ని పెంచుతుంది!

image

పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరులతో పోల్చితే రోజుకు 22ని.లు ఎక్కువగా నడుస్తారని లివర్‌పూర్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఏటా మిలియన్ కంటే ఎక్కువ అడుగులు అదనంగా వేస్తారని తేలింది. యజమానులు కుక్క వేగానికి తగ్గట్లు నడిస్తే హైబీపీ& కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. తద్వారా వారి జీవితకాలం పెరుగుతుంది. మీకూ పెంపుడు కుక్క ఉందా? కామెంట్ చేయండి.

News July 9, 2025

మెగా పేరెంట్స్ డే ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

image

ఏలూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రైవేట్, ప్రభుత్వ, జూనియర్ కళాశాల యజమానులు, విద్యాశాఖ అధికారులతో మెగా పేరెంట్స్ డే నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం కలెక్టర్ సమీక్షించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు క్రమ పద్దతిలో, మధ్యాహ్న భోజనం అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థి తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం, తల్లికి వందనం లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు.