News February 21, 2025
మహమ్మద్ షమీ ‘ది వారియర్’

మహమ్మద్ షమీ ఓటమిని ఒప్పుకోరు. గతేడాది కాలికి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితి నుంచి CT తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన వరకు తన కృషి పోరాట యోధుడికి ఏ మాత్రం తీసిపోదు. గాయంతో ఏడాదికి పైగా జట్టుకు దూరమైనా, BGTకి సెలక్ట్ కాకపోయినా, ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించకపోయినా పట్టుదల వదల్లేదు. ఏడాదిలోనే కమ్ బ్యాక్ చేసి బంగ్లాపై 5 వికెట్లు తీశారు. స్లో పిచ్‌పై రాకెట్ల లాంటి బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు.
Similar News
News February 22, 2025
కేంద్ర మంత్రికి విరిగిన కుర్చీ.. ఎయిర్ ఇండియాపై ఆగ్రహం

ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తనకు విమానంలో విరిగిన కుర్చీ కేటాయించారని మండిపడ్డారు. డబ్బు తీసుకుని ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నారని, ఇది వారిని మోసం చేయడమేనని దుయ్యబట్టారు. టాటా టేకోవర్ తర్వాత కూడా సంస్థ తీరు మారలేదన్నారు. దీంతో ఎయిర్ ఇండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంది.
News February 22, 2025
బీఆర్ఎస్ హయాంలో అనేక రంగాల్లో వృద్ధి: KTR

TG: కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని మీడియా సమావేశంలో తెలిపారు. రేవంత్ ఏమైనా మాట్లాడే ముందు Dy.CM భట్టి ఇచ్చిన నివేదికను చదవాలని సూచించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో అనేక రంగాల్లో వృద్ధి జరిగిందని తెలిపారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1గా ఉందని పేర్కొన్నారు.
News February 22, 2025
టన్నెల్ ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ <<15542453>>టన్నెల్ ప్రమాదంపై<<>> సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. వెంటనే అక్కడికెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు హెలికాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.