News February 21, 2025

లక్ష్మణచందా: విద్యార్థులకు అవగాహన కల్పించిన డీఈవో 

image

లక్ష్మణచందా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారి పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు.

Similar News

News September 16, 2025

‘కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి’

image

కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల, ఇప్పటికే జరిగిన ఫీజిబిలిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం అనువుగా లేనందున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో స్థలాన్ని ప్రతిపాదించామని తెలిపారు. అక్కడ త్వరగా సర్వే చేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలన్నారు.

News September 16, 2025

వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

image

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్‌లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.

News September 16, 2025

బతుకమ్మ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు: కమిషనర్

image

బతుకమ్మ పండుగ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులతో బతుకమ్మ ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు.