News February 21, 2025
సంగారెడ్డి: మైనర్ బాలికపై లైంగిక దాడి

మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాది పరిధిలోని రెండు పడక గదుల ఇళ్ల సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిది సంవత్సరాల పాపను ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News November 4, 2025
గండేపల్లి: యువకుడిని హత్య చేసిన వ్యక్తి అరెస్ట్

ఉమ్మడి తూగో(D) గండేపల్లి(M) యర్రంపాలెంలో యువకుడిని హత్య చేసిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు జగ్గంపేట సీఐ వై.ఆర్.కే. శ్రీనివాస్ తెలిపారు. గత నెల 31న నిందితుడు కాకర చిన్ని .. బుంగ బాజ్జీని కత్తితో మెడపై నరకగా బాజ్జీ మృతి చెందాడన్నారు. క్షణికావేశంతో భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.
News November 4, 2025
ASF: రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: NHRC

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ అన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు రైతులు పంట నష్టం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,722 మంది రైతులు నష్టపోయారని సర్వే నిర్వహించి, 3 నెలలు గడుస్తున్నా రైతులకు నష్టపరిహారం నిధులు విడుదల కాలేదని ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.
News November 4, 2025
108 రైస్ మిల్లులు, 234 రైతు కేంద్రాలు సిద్ధం: జేసీ

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు మొత్తం 108 రైస్ మిల్లులు, 234 రైతుసేవా కేంద్రాలు సిద్ధం చేశామని జేసీ అభిషేక్ గౌడ సోమవారం తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చేవారం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. జిల్లా లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను, ముందస్తుగా 85 లక్షల గోనె సంచులు సిద్ధం చేశామన్నారు. జీపీఎస్ డివైజ్ సిస్టంతో 3,803 వాహనాలను కూడా సిద్ధం చేసినట్లు జేసీ వివరించారు.


