News February 21, 2025
NGKL: గంజాయి సాగుపై ఉక్కు పాదం మోపండి: మంత్రి

జిల్లాలో గంజాయి, నాటు సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ బాడావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News October 24, 2025
ములుగు: నేడు భారత్ బంద్.. పోలీసులు అలర్ట్

నేడు భారత్ బందుకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, నిరసిస్తూ బందుకు పిలుపునిచ్చినట్లు ఇటీవల మావోయిస్టు నేత అభయ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. దీంతో ములుగు జిల్లాలోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఏజెన్సీపై నిఘా పెంచారు.
News October 24, 2025
కామారెడ్డి: ఈనెల 31 నుంచి పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ(అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ) రెగ్యులర్ 7, 9 సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు జరగనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్ విడుదల చేసామని, పూర్తి వివరాలకు వెబ్‌సైట్ సందర్శించాలని ఆయన తెలిపారు.
News October 24, 2025
ప్రకాశం జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవులు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో సెలవులు ఇచ్చామని, ఈ నిర్ణయాన్ని ప్రతి పాఠశాల యాజమాన్యం పాటించాలన్నారు.


