News March 21, 2024

వరంగల్: పాఠశాల దుస్తుల బకాయి నిధుల విడుదల

image

పెండింగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల కుట్టు కూలీ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టిన దర్జీల ఛార్జీల చెల్లింపు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2,11,932 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.2.11 కోట్లను విడుదల చేసింది.

Similar News

News July 5, 2024

మరో మైలురాయికి చేరువగా జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల!

image

జనగామ ఆంధ్ర భాషాభివర్ధిని (ABV) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో మైలు రాయిని చేరుకోబోతోంది. జిల్లాలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉన్న ఈ కాలేజీకి ఈ విద్యా సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి హోదా వస్తుందని ఆశిస్తున్నారు. UGC నిబంధనలను అనుసరించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతిపాదనలను UGCకి, కేయూ రిజిస్ట్రారు, కళాశాల అభివృద్ధి కమిటీ డీన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.

News July 5, 2024

నర్సింహులపేట: ఇద్దరు యువకుల మృతి.. కేసు నమోదు

image

MHBD జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో అనుమానాస్పద స్థితిలో శ్రవణ్ (25), రహీమ్ (24) అనే ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై స్థానిక పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి కల్తీ కల్లు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

News July 5, 2024

హనుమకొండ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం

image

ఏటూరునాగారానికి చెందిన ప్రవీణ్ కుమార్(30), హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన యువతి (28) కలిసి డిగ్రీ చదివారు. అప్పటి నుంచే ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం భీమారంలోనే ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే పెళ్లి చేసుకోమని యువతి కోరగా నిరాకరించాడు. దీంతో యువకుడిపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు KU ఎస్సై సురేశ్ తెలిపారు.