News February 21, 2025
విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలి: పాడేరు జేసీ

గిరిజన విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారికి సూచించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం విహార యాత్రకు వెళ్తున్న 120మంది విద్యార్థినులతో పాడేరు ఐటీడీఏలో సమావేశమయ్యారు.
Similar News
News November 8, 2025
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన తెలిసిందే. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం రాత్రి యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News November 8, 2025
ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో శాండ్ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్ ఉంటుంది.
News November 8, 2025
స్పోర్ట్స్ రౌండప్

➤ WWC విజయం: రిచా ఘోష్‌ను డీఎస్పీగా నియమించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం
➤ AUSvsIND టీ20 సిరీస్: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అభిషేక్ శర్మ
➤ వరుసగా 12వ టీ20 సిరీస్ గెలిచిన టీమ్ఇండియా
➤ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ
➤ IPL: నవంబర్ 15న తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించనున్న జట్లు.. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో LIVE చూడొచ్చు.


