News February 21, 2025

పల్లె పండుగ పనులు శత శాతం పూర్తికావాలి: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో పల్లె పండుగ కింద మంజూరైన పనులన్ని శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా పల్లె పండుగ కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్నారు.

Similar News

News January 13, 2026

TTD ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం

image

TTD ఆధ్వర్యంలోని SV బధిర హైస్కూల్, జూనియర్ కళాశాల, ITI, శ్రవణం, బాల మందిరాన్ని ఓకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ప్రస్తుతం విడివిడిగా ఉన్న వీటిని ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం చేసి అక్కడ పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అలిపిరి జూపార్క్ రోడ్డులో స్థలం కోసం పరిశీలన చేశారని తెలుస్తోంది. ఆ క్యాంపస్‌కు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలపై ఇప్పటికే నివేదిక ఆమోదం లభించిందని తెలుస్తుంది.

News January 13, 2026

రేపే మకరజ్యోతి దర్శనం

image

శబరిమలలో రేపు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాగా రేపు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికే అనుమతి ఉంది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.

News January 13, 2026

ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

image

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.