News February 21, 2025
రామాయంపేట: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పొట్టినోళ్ల నర్సింలు(55) అనే వ్యక్తి బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 5, 2025
మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్‌మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.


