News February 21, 2025
సిద్దిపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబు అన్నారు. సిద్దిపేట బ్లాక్ 16 మండలాలు, 3 మున్సిపాలిటీల డిసెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన JMLBC/ BLBC సమావేశాలు సిద్దిపేటలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆయన వెంట NABARD DDM నికిల్ రెడ్డి, పశువైద్య శాఖ JD వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2025
GOOD NEWS.. నెలకు రూ.7500?

EPFO కనీస పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి రూ.1000 పెన్షన్ వస్తుండగా, దీనిని రూ.7500కు పెంచాలని కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ పెన్షన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి FEB 28న జరిగే భేటీలో దీనిపై EPFO సెంట్రల్ బోర్డు ప్రకటన చేస్తుందనే ఆశతో ఉన్నారు.
News February 22, 2025
నిజామాబాద్: నగదు, బంగారం చోరీ

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.
News February 22, 2025
HYD: చందానగర్‌లో దారుణ హత్య

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్, నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.