News February 21, 2025
సంగారెడ్డి: ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బందిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

కంగ్టిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో సిబ్బంది విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పందించారు. వసతి గృహంలో ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులతో చేయించడాన్ని ఆమె తప్పుబట్టారు. హాస్టల్ సిబ్బందిపై విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డిఓ ఎస్.అశోక్ చక్రవర్తిని ఆదేశించారు.
Similar News
News February 22, 2025
నిజామాబాద్: నగదు, బంగారం చోరీ

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.
News February 22, 2025
HYD: చందానగర్‌లో దారుణ హత్య

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్, నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2025
సంగారెడ్డి: గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి

పటాన్చెరు మండలం చిట్కుల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పాఠశాలకు వెళ్లేందుకు రడీ అవుతుండగా ఇంట్లో గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. రాజేంద్ర సార్ అందరితో కలిసి మెలిసి ఉండే వారని, ఆయన మృతి బాధాకరమని తోటి టీచర్లు అన్నారు.