News February 21, 2025
14 ఏళ్లకే ఆరు ప్రపంచ రికార్డులు!

మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల ఆర్యన్ శుక్లా కాలిక్యులేటర్ కంటే వేగంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఇతడు 6 ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. వంద 4-అంకెల సంఖ్యలను కేవలం 30.9 సెకన్లలో, రెండు వందల 4 అంకెల సంఖ్యలను 1.9 నిమిషాల్లో, యాబై 5 అంకెల సంఖ్యలను 18.71 సెకండ్లలో యాడ్ చేశాడు. వీటితో పాటు డివిజన్, మల్టిప్లికేషన్స్‌లో మరో మూడు రికార్డులు సృష్టించాడు.
Similar News
News February 22, 2025
BREAKING: బాలుడు అర్ణవ్ కన్నుమూత

TG: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంటు లిఫ్టు-గోడకు మధ్య <<15540977>>ఇరుక్కున్న బాలుడు<<>> అర్ణవ్ కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. నడుము దగ్గర సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News February 22, 2025
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: భట్టి

TG: కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
News February 22, 2025
కేంద్ర మంత్రికి విరిగిన కుర్చీ.. ఎయిర్ ఇండియాపై ఆగ్రహం

ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తనకు విమానంలో విరిగిన కుర్చీ కేటాయించారని మండిపడ్డారు. డబ్బు తీసుకుని ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నారని, ఇది వారిని మోసం చేయడమేనని దుయ్యబట్టారు. టాటా టేకోవర్ తర్వాత కూడా సంస్థ తీరు మారలేదన్నారు. దీంతో ఎయిర్ ఇండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంది.