News February 21, 2025
బెల్లంపల్లి: FEB 23న TG CET

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఈనెల 23 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకొని రావాలని సూచించారు.
Similar News
News January 26, 2026
భూపాలపల్లి జిల్లాలో 87,134 మంది లబ్ధిదారులు

మహిళా శక్తి ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సమ్మక్క సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87,134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రూ.240 కోట్లకు పైగా రుణాలు అందించమని. అదే విదంగా మహిళాలకు 1,17,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
News January 26, 2026
అలాంటి రేప్ కేసులు చెల్లవు: హైకోర్టు

వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో యువతలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ధోరణి పెరిగిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. బ్రేకప్ తర్వాత మహిళల అత్యాచార ఆరోపణలతో పురుషులపై FIRలు నమోదవుతున్నాయని పేర్కొంది. కిడ్నాప్, రేప్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి దిగువకోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. బాధితురాలు ఇష్టపూర్వకంగా అతడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని, పైగా ఆ సమయంలో ఆమె మేజర్ అని స్పష్టం చేసింది.
News January 26, 2026
ASF: ఒకే గ్రామంలో 25 మంది ప్రభుత్వ ఉద్యోగులు

ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. పెంచికలపేట మండలం ఎల్లూరు గ్రామంలో 25 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. విద్యా శాఖలో 14 మంది, రెవెన్యూ శాఖలో 2, ట్రెజరరీ అండ్ అకౌంట్స్‌లో 1, ఆర్మీలో 5, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో 1, పోలీస్ శాఖలో 2 ప్రభుత్వ కొలువులు సాధించారు. తమ గ్రామానికి చెందిన 25మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు సన్మానించారు.


