News February 21, 2025

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

image

వన్డేల్లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్‌గా అజహరుద్దీన్ (156) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా ఈ లిస్టులో జయవర్ధనే (218), పాంటింగ్ (160) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అజహరుద్దీన్, కోహ్లీ ఉన్నారు. విరాట్ 295 ఇన్నింగ్స్‌లలో, అజహరుద్దీన్ 332 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ అందుకున్నారు.

Similar News

News November 11, 2025

మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

image

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

image

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్‌లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.

News November 11, 2025

లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

image

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.