News February 21, 2025
FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం

అమెరికా నిఘా సంస్థ FBIకి డైరెక్టర్‌గా కాష్ పటేల్ అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు దేశ సెనేట్ ఆయనకు అనుకూలంగా ఓటేసింది. ఆయన ఈ పదవి స్వీకరిస్తున్న తొలి భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. గుజరాత్‌కు చెందిన ఆయన తల్లిదండ్రులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. చరిత్ర, క్రిమినల్ జస్టిస్ విభాగాల్లో కాష్ డిగ్రీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు.
Similar News
News February 22, 2025
భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ ఇంటికే?

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలోని భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓడితే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే కివీస్ చేతిలో పాక్ ఓడిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్ ఓడితే న్యూజిలాండ్‌తో మార్చి 2న జరిగే మ్యాచ్ మనకు కీలకమవుతుంది. టాప్-2లో ఉండే జట్లు మాత్రమే సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం గ్రూప్-Aలో కివీస్, భారత్ టాప్-2లో ఉన్నాయి.
News February 22, 2025
అక్కడ ప్రజలందరికీ నీలి కళ్లే!

సాధారణంగా అధిక శాతం మంది ప్రజల కళ్లు గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో నివసించే బుటన్ తెగకు చెందిన ప్రజలు నీలి కళ్లను కలిగి ఉంటారు. వార్డెన్‌బర్గ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వల్ల ఇలా కళ్లు రంగు మారిపోయాయి. పిండం అభివృద్ధి సమయంలోనే ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాగా, చాలా మంది మోడల్స్ లెన్స్ ద్వారా నీలి కళ్లుగా మార్చుకుంటుంటారు.
News February 22, 2025
‘తమన్నా’ లుక్స్ అదిరిపోయాయిగా..!

మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఓదెల2’ మూవీలో డిఫరెంట్ గెటప్‌తో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ అమ్మడు అఘోరి పాత్రలో కనిపించి అందరినీ భయపడేలా చేశారు. <<15542277>>టీజర్‌లో<<>> శివశక్తి అవతారంలో అదరగొట్టారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మ్యూజిక్, విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. టీజర్ ఎలా ఉందో కామెంట్ చేయండి?