News February 21, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మడానికి వీల్లేదు: కలెక్టర్

image

ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిన రెండు పడకల గృహాల్లో అసలైన లబ్ధిదారులు నివాసం లేనివి గుర్తించి నోటీసులు జారీ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అద్దెకుగాని, లీజ్‌కు లేదా అమ్మడానికి వీలు లేదన్నారు.

Similar News

News January 13, 2026

మన ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఆ ఫీలింగే వేరు!

image

సంక్రాంతికి పట్టణాలన్నీ ఖాళీ అవుతుండగా పల్లెలు సందడిగా మారాయి. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు. అయితే మన ఊరు కొద్ది దూరంలో ఉందనగా కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్, చెరువు, పొలాలు తదితరాలు గుర్తుకొస్తాయి. పండగకి ఊరెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో.. తిరిగొచ్చేటప్పుడు అంతే బాధగా అన్పిస్తుంది కదా?

News January 13, 2026

ప్రభుత్వం పనితీరుపై చిత్తూరు ప్రజల స్పందన ఇదే..!

image

ప్రభుత్వ సేవలు అందడంలో చిత్తూరు జిల్లాలో 66% మందే సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పింఛన్ల పంపిణీపై 85.4, అన్న క్యాంటీన్లపై 84.4, దీపం పథకంపై 66.2, ఆర్టీసీ బస్సులపై 70.9, వైద్య సేవలపై 62.4, రిజిస్ట్రేషన్ సేవలపై 64.2, హౌసింగ్ పథకంపై 52.9, రెవెన్యూ సేవలపై 45.5, రెవెన్యూ సర్వేపై 45.1 శాతం సంతృప్తి ఉందని వివరించారు.

News January 13, 2026

మెదక్: కౌన్సిలర్ అభ్యర్థుల్లో రిజర్వేషన్ టెన్షన్

image

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.