News February 21, 2025
అధికారికంగా విడిపోయిన చాహల్-ధనశ్రీ?

స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం. ‘45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ వారు మనసు మార్చుకోలేదు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. విడిపోయాక ఒత్తిడి నుంచి బయటపడ్డాననే అర్థంలో ధనశ్రీ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టడం గమనార్హం.
Similar News
News February 22, 2025
గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం

ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని APPSCని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. అటు రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11న జరగనుండగా, అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
News February 22, 2025
భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ ఇంటికే?

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలోని భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓడితే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే కివీస్ చేతిలో పాక్ ఓడిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్ ఓడితే న్యూజిలాండ్‌తో మార్చి 2న జరిగే మ్యాచ్ మనకు కీలకమవుతుంది. టాప్-2లో ఉండే జట్లు మాత్రమే సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం గ్రూప్-Aలో కివీస్, భారత్ టాప్-2లో ఉన్నాయి.
News February 22, 2025
అక్కడ ప్రజలందరికీ నీలి కళ్లే!

సాధారణంగా అధిక శాతం మంది ప్రజల కళ్లు గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో నివసించే బుటన్ తెగకు చెందిన ప్రజలు నీలి కళ్లను కలిగి ఉంటారు. వార్డెన్‌బర్గ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వల్ల ఇలా కళ్లు రంగు మారిపోయాయి. పిండం అభివృద్ధి సమయంలోనే ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాగా, చాలా మంది మోడల్స్ లెన్స్ ద్వారా నీలి కళ్లుగా మార్చుకుంటుంటారు.