News February 21, 2025

నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం

image

ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకెళ్తోందంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. నీటి వాటాల కేటాయింపు, రెండు రాష్ట్రాల ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది.

Similar News

News February 22, 2025

ఇండియాకు SAMSUNG మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్?

image

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ‘SAMSUNG’ చైనాలోని తన మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఇండియాకు మార్చనున్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్‌లతో ఇబ్బందులు ఎదురవడంతో శామ్‌సంగ్ తన స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తిని చైనా నుంచి ఇండియా/వియత్నాంకు తరలించాలని చూస్తోందని చెప్పారు. వియత్నాం కూడా US టారిఫ్‌ల ప్రమాదాన్ని ఎదుర్కోనుండటంతో INDకు మార్చడం బెటర్ అని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.

News February 22, 2025

దేశంలో ఏ CM చేయని సాహసం చేస్తున్నా: రేవంత్

image

TG: దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని CM రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజాభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాహుల్ హామీ మేరకే కులగణన చేపట్టాం. BCల సంఖ్యపై గతంలో KCR కాకి లెక్కలు చెప్పారు. కానీ మేం అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించాం. ఇంటి యజమానులు చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News February 22, 2025

హోలీ పండుగపై కామెంట్స్.. బాలీవుడ్ డైరెక్టర్‌పై కేసు

image

హోలీ పండుగపై బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ తక్కువ స్థాయి వారు(ఛప్రి) చేసుకునేదని ఆమె వ్యాఖ్యానించారు. ఫరా వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఆశ్రయించగా ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఫరాపై చర్యలు తీసుకోవాలని, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.

error: Content is protected !!