News February 21, 2025

ఇవాళ్టి నుంచి టమాటా కొనుగోళ్లు

image

AP: టమాటా ధరల పతనం నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రైతుల పంటను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది. అయితే ఏ రేటుతో అనేది వెల్లడించలేదు. ఆ టమాటాను రైతు బజార్లలో విక్రయించనుంది. అవసరం మేరకు పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్లో కేజీ <<15523622>>రూ.4కు చేరిన<<>> విషయం తెలిసిందే.

Similar News

News February 22, 2025

దేశంలో ఏ CM చేయని సాహసం చేస్తున్నా: రేవంత్

image

TG: దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని CM రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజాభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాహుల్ హామీ మేరకే కులగణన చేపట్టాం. BCల సంఖ్యపై గతంలో KCR కాకి లెక్కలు చెప్పారు. కానీ మేం అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించాం. ఇంటి యజమానులు చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News February 22, 2025

హోలీ పండుగపై కామెంట్స్.. బాలీవుడ్ డైరెక్టర్‌పై కేసు

image

హోలీ పండుగపై బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ తక్కువ స్థాయి వారు(ఛప్రి) చేసుకునేదని ఆమె వ్యాఖ్యానించారు. ఫరా వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఆశ్రయించగా ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఫరాపై చర్యలు తీసుకోవాలని, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.

News February 22, 2025

GOLD: పెరుగుతూ పోతే కొనేదెలా!

image

బంగారం ధరల పెరుగుదల చూస్తుంటే త్వరలోనే తులం రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర పెరిగి, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.80,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,770లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.900 తగ్గి కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.

error: Content is protected !!