News February 21, 2025
అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు: మన్యం SP

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలు చేపడతామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రత్యేక టీం ద్వారా నిరంతరం నిఘా ఉందని చెప్పారు. యువత సోషల్ మీడియాను వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News November 9, 2025
ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News November 9, 2025
కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.
News November 9, 2025
లాంచీలో శ్రీశైలం యాత్ర

TG: కృష్ణా నదిలో నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్(D) సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర పున:ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక 9AMకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ అందిస్తారు. వన్ సైడ్ జర్నీకి పెద్దలకు ₹2000, పిల్లలకు ₹1600 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/లో చూడగలరు.


