News February 21, 2025

నల్లజర్ల: గుండెపోటుతో పాస్టర్ మృతి

image

నల్లజర్ల మండలం, చీపురుగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. చీపురుగూడెం గ్రామ నివాసి పాస్టర్ వెంకటేశ్వరరావు గుండెపోటుతో అకస్మాత్తుగా పడిపోవడంతో 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆయ‌న మృతి చెందినట్లు నల్లజర్ల 108 సిబ్బంది నిర్ధారించారు. 

Similar News

News August 13, 2025

నిడదవోలు: ‘మత్తురా’ సినిమా టీజర్‌ విడుదల చేసిన మంత్రి

image

నిడదవోలు క్యాంపు కార్యాలయంలో ‘మత్తురా’ సినిమా టీజర్‌ను మంత్రి కందుల దుర్గేశ్ బుధవారం విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మత్తురా సినిమా టీజర్ ఎంతో ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా ఉందన్నారు. మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎద్దుల రాజారెడ్డి, దర్శకుడు పువ్వల చలపతి, సంగీత దర్శకుడు బోసం మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News August 13, 2025

ర్యాగింగ్‌కి పాల్పడితే శిక్షలు కఠినం: ఎస్పీ

image

ర్యాగింగ్ పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని, భవిష్యత్తు నాశనం అవుతుందని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ అన్నారు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కి దూరంగా ఉంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ ర్యాగింగ్‌కి దూరంగా ఉంటామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

News August 13, 2025

దివాన్ చెరువులో 15 నుంచి జోన్ హ్యాండ్ బాల్ పోటీలు

image

మండలంలోని దివాన్ చెరువు ఈనెల 15 నుంచి 18 వరకు CBSE సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు జరుగుతాయని కరస్పాండెంట్ సి.హెచ్.విజయ్ ప్రకాశ్ తెలిపారు. శ్రీ ప్రకాశ్ విద్యా నికేతన్ క్రీడా ప్రాంగణంలో జరిగే ఈ పోటీలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ లోని 1,200 క్రీడాకారులు హాజరవుతారు.