News March 21, 2024

నేడు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

పెద్దపల్లి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరోనని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

Similar News

News October 26, 2025

కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్‌కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

News October 26, 2025

కరీంనగర్ మహాసభకు ‘తరలిన శ్రీనివాసులు’

image

చొప్పదండి మండలం నుంచి శ్రీనివాస నామదేయ మిత్రులు ఆదివారం పెద్దసంఖ్యలో KNRలో జరుగుతున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వార్షికోత్సవ మహాసభకు తరలివెళ్లారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ సభకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వార్షికోత్సవ మహాసభ సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News October 25, 2025

KNR: పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో “GIVE BLOOD – SAVE LIFE” నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పీటీసీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కళాశాల అధికారులను సీపీ అభినందించారు.